వేములవాడలో విచిత్ర ఘటన.. దేవుడికి ఇచ్చిన రూ.7 లక్షల విరాళం తిరిగి ఇవ్వాలని కుమార్తెల వినతి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. వేములవాడకు చెందిన ఓ వృద్ధ దంపతులు తమ ఏడుగురు కుమార్తెల వివాహాలు పూర్తయ్యాక జీవితకాల పొదుపు అయిన రూ.7,01,116ను రాజన్న నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళంగా సమర్పించారు.
ఆలయ అధికారులు విరాళాన్ని స్వీకరించి రశీదు అందజేయడంతో పాటు దాతలను శాలువాతో సత్కరించారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే వారి కుమార్తెలు ఆలయ కార్యాలయానికి చేరుకుని, తమ తండ్రి వయోభారం కారణంగా మతిస్థిమితం సరిగా లేదని, భవిష్యత్ వైద్య ఖర్చులు మరియు తల్లిదండ్రుల పోషణ కోసం ఆ సొమ్మును తిరిగి ఇవ్వాలని అధికారులను కోరారు.
దీనిపై స్పందించిన ఆలయ అధికారులు, స్వచ్ఛందంగా సమర్పించిన విరాళం ఒకసారి ట్రస్టు ఖాతాలో జమ అయిన తర్వాత నిబంధనల ప్రకారం తిరిగి చెల్లించే అవకాశం లేదని స్పష్టం చేశారు. విరాళం ఇచ్చే సమయంలో దంపతులు స్వయంగా అంగీకారంతోనే సొమ్ము అందజేశారని, ట్రస్టు నిధులను వెనక్కి ఇచ్చే అధికారం తమకు లేదని తెలిపారు.దీంతో కుమార్తెలు నిరాశతో వెనుదిరిగారు. ఈ ఘటన ప్రస్తుతం వేములవాడలో చర్చనీయాంశంగా మారింది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)