పౌర్ణమి గరుడసేవలో మలయప్ప స్వామి దివ్య విహారం
తిరుమలలో పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ వేలాది మంది భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. గరుడసేవను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
వైష్ణవ సంప్రదాయంలో గరుడ వాహనసేవకు విశిష్ట స్థానం ఉంది. గరుడునిపై స్వామివారి విహారం భక్తి, శరణాగతి, జ్ఞాన వైరాగ్యాలకు ప్రతీకగా భావిస్తారు. గరుడసేవను దర్శించడం ద్వారా సర్వపాపాలు తొలగి దైవానుగ్రహం లభిస్తుందనే విశ్వాసం భక్తుల్లో ఉంది. ఈ వేడుకలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)