ప్రపంచస్థాయి ఎలక్ట్రానిక్స్ హబ్‌గా నాయుడుపేట.. రూ.1,595 కోట్ల PCB ప్రాజెక్టుతో ఏపీకి భారీ ఊపు

Jul 02, 2026 - 15:23
0 1
ప్రపంచస్థాయి ఎలక్ట్రానిక్స్ హబ్‌గా నాయుడుపేట.. రూ.1,595 కోట్ల PCB ప్రాజెక్టుతో ఏపీకి భారీ ఊపు

ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. తిరుపతి జిల్లా నాయుడుపేట ను ప్రపంచస్థాయి PCB (Printed Circuit Board), EMS (Electronics Manufacturing Services), ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

భారత్ ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ తయారీలో గ్లోబల్ స్థాయిలో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోందని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఈ రంగంలో కీలక శక్తిగా ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు. "Make in India... Make in Andhra Pradesh" లక్ష్యంతో రాష్ట్రంలో బలమైన ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్‌ను రూపొందిస్తున్నామని వెల్లడించారు.

నాయుడుపేటలో రూ.1,595 కోట్ల భారీ పెట్టుబడి

ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై పాలసీ కింద సిర్మా స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SSEPL) సంస్థ నాయుడుపేటలో రూ.1,595 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద PCB తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టులో దక్షిణ కొరియాకు చెందిన షిన్‌హ్యూప్ ఎలక్ట్రానిక్స్ భాగస్వామిగా ఉంది.ఈ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం గతంలోనే ఆమోదం తెలిపింది. ప్రాజెక్టుకు అవసరమైన భూమి, ప్రోత్సాహకాలు, రాయితీలను కూడా కల్పించింది.

2,170 మందికి ఉద్యోగాలు

ఈ ప్రాజెక్టు ద్వారా 2,170 మందికిపైగా నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమకు ఇది కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

అధునాతన PCBల తయారీ

ఏపీఐఐసీకి చెందిన 12.56 ఎకరాల భూమిని సిర్మా సంస్థకు 75 శాతం రాయితీతో ప్రభుత్వం కేటాయించింది. అక్కడ PCB తయారీ యూనిట్‌తో పాటు అత్యాధునిక రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D) కేంద్రం కూడా ఏర్పాటు చేయనున్నారు.ఈ ప్లాంట్‌లో సింగిల్ లేయర్, మల్టీ లేయర్, హెచ్‌డీఐ (HDI), ఫ్లెక్సిబుల్ PCBలు తయారు చేయనున్నారు. వీటిని ప్రధానంగా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, టెలికాం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో వినియోగించనున్నారు.అదనంగా 4.14 ఎకరాల్లో Electronics Manufacturing Services (EMS) ఫెసిలిటీ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

చైనాకు పెరుగుతున్న PCB ఎగుమతులు

ఒకప్పుడు PCBల కోసం చైనాపై ఆధారపడిన భారత్, ఇప్పుడు అదే చైనాకు భారీగా ఎగుమతులు చేస్తోంది. 2025లో 36 మిలియన్ డాలర్లుగా ఉన్న PCB ఎగుమతులు, 2026 నాటికి 1.5 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం భారత PCB ఎగుమతుల్లో దాదాపు 80 శాతం చైనాకే వెళ్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ Electronics Components Manufacturing Scheme (ECMS), Make in India కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు కూడా ఈ రంగం అభివృద్ధికి దోహదపడుతున్నాయి.నాయుడుపేటలో చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎగుమతుల కేంద్రంగా నిలబెట్టే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User