అంతర్వేది మత్స్యకారుల వలలో అరుదైన కచిడి చేపలు.. అదృష్టం అంటే ఇదే

Jun 22, 2026 - 15:04
0 2
అంతర్వేది మత్స్యకారుల వలలో అరుదైన కచిడి చేపలు..  అదృష్టం అంటే ఇదే

రెండు నెలల వేట నిషేధం ముగిసిన వెంటనే సముద్రంలోకి వెళ్లిన అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారులకు అదృష్టం కలిసొచ్చింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌కు చెందిన మత్స్యకారుల వలకు ఒకేసారి మూడు అరుదైన కచిడి చేపలు చిక్కడం స్థానికంగా సంచలనం రేపింది.

వేట నిషేధం అనంతరం తొలి ప్రయాణంలోనే ఇంత అరుదైన చేపలు దొరకడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. సముద్రం నుంచి తీసుకొచ్చిన ఈ మూడు చేపలను హార్బర్‌లో బహిరంగ వేలం నిర్వహించగా, స్థానిక వ్యాపారి మొత్తం రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశాడు. అరుదైన జాతికి చెందిన చేపలు కావడంతో వేలంలో మంచి ధర పలికినట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి.

స్థానిక మత్స్యకారుల వివరాల ప్రకారం, పట్టుబడిన చేపల్లో రెండు మగ చేపలు, ఒక ఆడ చేప ఉన్నాయి. వీటి బరువు సుమారు 12 నుంచి 13 కిలోల మధ్య ఉందని తెలిపారు. కచిడి చేపల పొట్ట భాగంలో లభించే ప్రత్యేక పదార్థాన్ని కొన్ని ఔషధ తయారీలో వినియోగిస్తారని, అందుకే వీటికి మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంటుందని వారు పేర్కొన్నారు.

ఇంకా పెద్ద పరిమాణంలో ఉండే కచిడి చేపలు దొరికితే ఒక్కో చేపకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ధర పలికే అవకాశం ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. అందువల్ల ఇలాంటి అరుదైన చేపలు వలలకు చిక్కితే మత్స్యకారులకు భారీ ఆదాయం లభిస్తుందని తెలిపారు.

ఒకేసారి మూడు అరుదైన చేపలు లభించడంతో అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ వద్ద పెద్ద సంఖ్యలో మత్స్యకారులు, స్థానికులు చేరుకుని వాటిని ఆసక్తిగా వీక్షించారు. రెండు నెలల విరామం తర్వాత తొలి రోజే ఇలాంటి అరుదైన వేట జరగడం శుభసూచకంగా భావిస్తున్న మత్స్యకారులు, ఈ సీజన్‌లో మరింత మంచి వేట లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User