బర్త్‌డేకు బదులు నిరసన.. ఇందిరా పార్క్‌లో నల్లచొక్కా ధరించి విద్యార్థులతో కలిసి పోరుబాటలో కేటీఆర్

Jul 24, 2026 - 13:42
Updated: 2 months ago
0 3
బర్త్‌డేకు బదులు నిరసన.. ఇందిరా పార్క్‌లో నల్లచొక్కా ధరించి    విద్యార్థులతో కలిసి పోరుబాటలో కేటీఆర్

ఢిల్లీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలకు సంఘీభావంగా బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్‌వీ) హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని విద్యార్థులకు మద్దతు ప్రకటించారు.

తన 50వ పుట్టినరోజు వేడుకలను నిర్వహించకుండా నిరసనలో పాల్గొనాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు. నల్లచొక్కా ధరించి ఇందిరా పార్క్‌కు చేరుకున్న ఆయన విద్యార్థులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్ పిలుపుతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు ఇందిరా పార్క్‌కు తరలివచ్చారు. విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల ఆందోళనలకు మద్దతుగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.

అలాగే బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే యువత కోసం చేపట్టే కార్యక్రమాలు, ఉద్యోగాల భర్తీ, నియామక పరీక్షల నిర్వహణలో తీసుకురానున్న సంస్కరణలపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.

ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User