మరిచిపోయిన 100 గ్రాముల బంగారం బ్యాగు.. భక్తుడికి సురక్షితంగా అప్పగించిన టీటీడీ
తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తుల ప్రవేశ ద్వారమైన అలిపిరి చెక్‌పాయింట్‌లో టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది తమ అప్రమత్తత, నిజాయితీని మరోసారి చాటిచెప్పారు.
సోమవారం ఉదయం భద్రతా తనిఖీల సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన భక్తుడు శ్రీ మహేష్ అనుకోకుండా తన బ్యాగును అలిపిరి చెక్‌పాయింట్ వద్దే మరిచిపోయారు. వెంటనే స్పందించిన విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఆ బ్యాగును స్వాధీనం చేసుకుని పరిశీలించగా, అందులో సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు.
అనంతరం సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి బ్యాగు యజమానిని గుర్తించిన అధికారులు, భక్తుడిని కార్యాలయానికి పిలిపించి పూర్తి వివరాలు ధృవీకరించిన తర్వాత బ్యాగును సురక్షితంగా అప్పగించారు.
టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది నిజాయితీ, సేవాభావాన్ని భక్తుడు శ్రీ మహేష్ అభినందిస్తూ టీటీడీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)