యూట్యూబ్‌లో బెల్లంకొండ సంచలనం .. 100 కోట్ల వ్యూస్ రికార్డ్

Jun 29, 2026 - 14:10
Updated: 12 days ago
0 2
యూట్యూబ్‌లో బెల్లంకొండ సంచలనం .. 100 కోట్ల వ్యూస్ రికార్డ్

ఒక చోట ఫెయిల్ అయినా మరో చోట సక్సెస్ సాధించవచ్చు అనే మాట సినిమాలకు కూడా వర్తిస్తుంది. థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన ఒక సినిమా ఇప్పుడు యూట్యూబ్‌లో మాత్రం చరిత్ర సృష్టించింది.

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘జయ జానకి నాయక’ హిందీ డబ్బింగ్ వెర్షన్ ‘ఖూన్‌ఖార్’యూట్యూబ్‌లో ఏకంగా 100 కోట్ల (1 బిలియన్) వ్యూస్ దాటి సంచలనం సృష్టించింది. ఈ ఫీట్‌తో భారతీయ డిజిటల్ చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, హిందీ డబ్బింగ్ వెర్షన్ మాత్రం నార్త్ ఇండియా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్ ఎలిమెంట్స్ కారణంగా యూట్యూబ్‌లో భారీ రెస్పాన్స్ వచ్చింది.

ఈ రికార్డుతో ‘ఖూన్‌ఖార్’యూట్యూబ్‌లో 100 కోట్ల వ్యూస్ దాటిన తొలి భారతీయ డబ్బింగ్ సినిమాగా నిలిచింది. అంతకుముందు భారీ హిట్‌గా నిలిచిన ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ హిందీ వెర్షన్ 861 మిలియన్ వ్యూస్‌తో రెండో స్థానంలో ఉంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలు థియేటర్లలో మిశ్రమ ఫలితాలు అందుకున్నప్పటికీ, హిందీ డబ్బింగ్ వెర్షన్లు మాత్రం యూట్యూబ్‌లో భారీ వ్యూస్ సాధిస్తున్నాయి. ‘అల్లుడు అదుర్స్’, ‘కవచం’,‘సీత’వంటి సినిమాలకు కూడా నార్త్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ డిజిటల్ క్రేజ్ కారణంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. నిర్మాతలకు కూడా ఇది మంచి ఆదాయ వనరుగా మారింది. అంతేకాకుండా బాలీవుడ్‌లో కూడా ఆయనకు అవకాశాలు వచ్చాయి.

థియేటర్లలో ఫలితం ఎలా ఉన్నా, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో మాత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User