రిషబ్ శెట్టికి అంతర్జాతీయ గౌరవం.. మెల్‌బోర్న్‌లో ప్రతిష్టాత్మక అవార్డు
'కాంతార' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకోనున్నారు. భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టడంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM) 2026 ప్రతిష్టాత్మక 'లీడర్‌షిప్ ఇన్ సినిమా' అవార్డును ప్రకటించింది.
ఆగస్టు 13న ఆస్ట్రేలియాలో జరిగే అవార్డుల వేడుకలో రిషబ్ శెట్టి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ పురస్కారాన్ని స్వీకరించనున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా భారతీయ సినీ రంగానికి అందించిన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రకటించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
అవార్డు ప్రకటించడంపై స్పందించిన రిషబ్ శెట్టి.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, జానపద వారసత్వాన్ని ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. మన మూలాల ఆధారంగా రూపొందిన కథలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందడం గర్వకారణమని పేర్కొన్నారు.
'కాంతార'తో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి ప్రస్తుతం భారీ పాన్-ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'జై హనుమాన్' చిత్రంలో హనుమంతుడి పాత్రలో నటిస్తుండగా, 'ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్'చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.
భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకొస్తున్న రిషబ్ శెట్టికి ఈ పురస్కారం దక్కడం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)