భారతీయ సూక్ష్మ శిల్పకళకు అంతరిక్ష గౌరవం.. సూది రంధ్రంలో ముగ్గురు మహనీయుల ప్రతిరూపాలు
భారత అంతరిక్ష చరిత్రలో మరో విశేష ఘట్టం నమోదైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడమే కాకుండా, దానితో పాటు భారతీయ సూక్ష్మ శిల్పకళకు చెందిన అరుదైన కళాఖండాలు కూడా అంతరిక్షంలోకి చేరాయి.
వరంగల్‌కు చెందిన అంతర్జాతీయ అతిసూక్ష్మ కళాకారుడు అజయ్ కుమార్ సూది రంధ్రంలో భారతదేశపు ముగ్గురు మహనీయులు డా. సి.వి. రామన్, డా. విక్రమ్ సారాభాయి, భారతరత్న డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం ప్రతిరూపాలను అత్యంత సూక్ష్మంగా చెక్కారు. కేవలం 800 మైక్రాన్ల (0.8 మిల్లీమీటర్లు) ఎత్తుతో రూపొందించిన ఈ శిల్పాలను ప్రత్యేక మైక్రోస్కోప్‌తో మాత్రమే చూడగలరు.
ఈ కళాఖండాల తయారీకి సుమారు 140 గంటలు పట్టగా, స్టెయిన్‌లెస్ స్టీల్, 24 క్యారెట్ల బంగారం, స్వచ్ఛమైన వెండి, సిరామిక్ పొడి, కార్బన్ ఫైబర్ వంటి ప్రత్యేక పదార్థాలను ఉపయోగించారు. అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన వైబ్రేషన్, హీట్ తదితర సాంకేతిక పరీక్షల్లో ఇవి విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిన అనంతరం విక్రమ్-1 రాకెట్ పేలోడ్‌లో భాగంగా పంపించారు.
ఈ అరుదైన అవకాశం ద్వారా భారతీయ సూక్ష్మ శిల్పకళ ప్రపంచ అంతరిక్ష కళా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. నాలుగు దశాబ్దాలుగా సూక్ష్మ శిల్పకళలో సేవలందిస్తున్న తనకు ఇది అత్యున్నత గౌరవమని కళాకారుడు అజయ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)