ఎస్పీ బాలుపై క్రష్.. కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటానన్న సీనియర్ నటి సుధా
సీనియర్ నటి సుధా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, అభిమాన నటీనటులు, వ్యక్తిగత అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు జీవితాంతం అత్యంత ఇష్టమైన నటి ఎవరంటే ఎలాంటి సందేహం లేకుండా దివంగత మహానటి సావిత్రి పేరే చెబుతానని అన్నారు.
అలాగే సినీ రంగంలో తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి గానగంధర్వుడు ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం అని వెల్లడించారు. ఆయనపై తనకు ఎంతో అభిమానం ఉండేదని, ఒకసారి సరదాగా "మిమ్మల్ని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాల్సిందే" అని చెప్పానని గుర్తుచేసుకున్నారు. దానికి బాలూ గారు నవ్వుతూ "అయిపోయింది కదా" అని సరదాగా సమాధానం ఇచ్చారని తెలిపారు.
బాలసుబ్రహ్మణ్యం గారిపై తనకున్న అభిమానాన్ని తండ్రిపై ఉన్న ప్రేమతో పోల్చిన సుధా, కారులో ప్రయాణించే సమయంలో ఇప్పటికీ ఆయన పాటలనే ఎక్కువగా వింటానని చెప్పారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా సుధా ప్రత్యేక గుర్తింపు పొందారు. ముఖ్యంగా మోహన్‌లాల్ తల్లిగా నటించిన చిత్రం ఘనవిజయం సాధించడంతో, ఇప్పటికీ అభిమానులు తనను "లాలెట్టన్ అమ్మ" అని గుర్తించి అభిమానాన్ని చాటుకుంటారని చెప్పారు. ఇటీవల గురువాయూర్ వెళ్లినప్పుడు అభిమానులు తనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపడం ఆనందాన్ని కలిగించిందని వెల్లడించారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)