ఒకే ఓటీటీలో 60 కొత్త ప్రాజెక్ట్స్.. జీ5 నుంచి భారీ ఎంటర్‌టైన్‌మెంట్!

Jul 22, 2026 - 14:16
0 4
ఒకే ఓటీటీలో 60 కొత్త ప్రాజెక్ట్స్.. జీ5 నుంచి భారీ ఎంటర్‌టైన్‌మెంట్!


ఓటీటీ ప్రేక్షకులకు జీ5 భారీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. రాబోయే రోజుల్లో తన ప్లాట్‌ఫామ్‌లో ఏకంగా 60 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, యానిమేషన్, ఏఐ ఆధారిత ప్రాజెక్ట్‌లను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ కొత్త కంటెంట్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో తమ రాబోయే ప్రాజెక్టులను ప్రకటించగా.. ఇప్పుడు జీ5 కూడా భారీ లైనప్‌ను వెల్లడించింది.

తెలుగు ప్రేక్షకుల కోసం రానున్న ముఖ్యమైన ప్రాజెక్టులు:

* నాగచైతన్య నటిస్తున్న "వృషకర్మ"
* బాలకృష్ణ 111వ చిత్రం
* అనిల్ రావిపూడి – వెంకటేశ్ కొత్త సినిమా
* కళ్యాణ్ రామ్ కొత్త మూవీ
* నివేదా థామస్ నటిస్తున్న "శ్రీమతి"
* భూతం భయ్యం
* శ్రీకాంత్ నటిస్తున్న "అబ్జెక్షన్ మై లార్డ్"
* "అనంతకాలం" వెబ్ సిరీస్
* జగపతిబాబు "జయమ్ము నిశ్చయమ్మురా 2" టాక్ షో

మొత్తంగా అన్ని భాషలు కలిపి 21 సినిమాలు, 27 వెబ్ సిరీస్‌లు, 6 యానిమేషన్ ప్రాజెక్టులు, 6 ఏఐ ఆధారిత కంటెంట్‌లను జీ5 విడుదల చేయనుంది. దీంతో రాబోయే నెలల్లో ఓటీటీ ప్రేక్షకులకు వినోదం మరింత పెరగనుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User