'కొత్త ఛాప్టర్' అంటూ వైభవ్ సూర్యవంశీ హింట్.. ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో డెబ్యూ ఖాయమేనా?

Jul 04, 2026 - 15:02
0 2
'కొత్త ఛాప్టర్' అంటూ వైభవ్ సూర్యవంశీ హింట్.. ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో డెబ్యూ ఖాయమేనా?

వైభవ్ సూర్యవంశీ చేసిన తాజా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంగ్లాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌కు ముందు తన ఫొటోను షేర్ చేస్తూ 'కొత్త ఛాప్టర్' అనే క్యాప్షన్‌తో పాటు టోర్నడో ఎమోజీని జోడించడంతో, టీమిండియా తరపున అతడి అరంగేట్రంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో పాటు ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో కూడా బెంచ్‌కే పరిమితమైన వైభవ్, ప్రాక్టీస్‌లో మాత్రం ఆకట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడు చేసిన సోషల్ మీడియా పోస్ట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. 'కొత్త అధ్యాయం' ప్రారంభం కానుందనే సంకేతంగా పలువురు నెటిజన్లు భావిస్తూ, రెండో టీ20లో అతడి డెబ్యూ దాదాపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా, జట్టు కూర్పులో మార్పులు ఉండొచ్చనే ప్రచారం కూడా సాగుతోంది. సమాచారం ప్రకారం, సంజు శాంసన్ ను ఓపెనింగ్ నుంచి వన్‌డౌన్‌కు పంపించి, తిలక్ వర్మ స్థానంలో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

భారత్–ఇంగ్లాండ్ రెండో టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్ వేదికగా జరగనుంది. టాస్ సమయంలోనే భారత జట్టు తుది ప్లేయింగ్ ఎలెవన్ ప్రకటించనుంది. అప్పటి వరకు వైభవ్ డెబ్యూపై ఉత్కంఠ కొనసాగనుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User