గోల్కొండ బోనాలు.. జులై 26 వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో మళ్లింపులు

Jul 17, 2026 - 13:31
0 2
గోల్కొండ బోనాలు.. జులై 26 వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో మళ్లింపులు

శ్రీ జగదంబ మహంకాళి గోల్కొండ బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. జులై 19, 23, 26 తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు.

రామ్‌దేవ్‌గూడ–మక్కై దర్వాజా, లంగర్ హౌజ్–ఫతే దర్వాజా, షేక్‌పేట్–బంజారా దర్వాజా మార్గాల్లో ట్రాఫిక్‌ను అవసరాన్ని బట్టి మళ్లించనున్నారు. నార్సింగి, సన్‌సిటీ, ఫిల్మ్‌నగర్, షేక్‌పేట్, మొఘల్‌కా నాలా ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను బాలికా భవన్, నానల్‌నగర్, నెక్నాంపూర్ తదితర ప్రత్యామ్నాయ మార్గాల వైపు దారి మళ్లిస్తారు.

భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. ద్విచక్ర వాహనాల కోసం అషూర్ ఖానా, ఆర్టిలరీ సెంటర్, హుడా పార్క్, గవర్నమెంట్ స్కూల్, గోల్కొండ ఏరియా హాస్పిటల్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. కార్లు, ఆటోలను ఒవైసీ గ్రౌండ్, హాకీ గ్రౌండ్, డెక్కన్ పార్క్‌లలో పార్క్ చేయాలని సూచించారు.

ట్రాఫిక్ ఇబ్బందులను నివారించేందుకు వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User