నాగార్జున 100వ సినిమాలో విలన్‌గా టబు ..
టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న 100వ సినిమా చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రంపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తాజాగా మరో ఆసక్తికర ప్రచారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు నాగార్జునతో సూపర్ హిట్ జోడీగా మెప్పించిన స్టార్ హీరోయిన్ టబు.. ఇప్పుడు ఆయనకు విలన్‌గా కనిపించనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
100వ సినిమాకు ప్రత్యేక ప్లాన్
ఇప్పటికే 99 సినిమాలు పూర్తి చేసిన నాగార్జున.. తన 100వ చిత్రాన్ని కెరీర్‌లో మైలురాయిగా నిలిచేలా రూపొందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల 'కుబేర'లో కీలక పాత్రతో పాటు 'కూలీ' చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్న నాగార్జున.. ఇప్పుడు మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం.
ఈ చిత్రానికి 'లాటరీ కింగ్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
టబు విలన్‌గా..?
తాజాగా వినిపిస్తున్న ప్రచారం ప్రకారం.. ఈ సినిమాలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటించనున్నారట. అంతేకాదు.. నాగార్జునకు ఎదురుగా నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఈ వార్తతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఒకప్పుడు నాగార్జున-టబు జంటగా 'నిన్నే పెళ్లాడతా', 'ఆవిడా మా ఆవిడే' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. 'సిసింద్రీ' సినిమాలో టబు ప్రత్యేక గీతంలో కూడా సందడి చేశారు.
27 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబినేషన్?
దాదాపు 27 ఏళ్ల తర్వాత నాగార్జున-టబు కాంబినేషన్ మళ్లీ తెరపై కనిపించబోతోందనే ప్రచారం అభిమానులను ఉత్సాహపరుస్తోంది. ప్రస్తుతం టబు.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'స్లమ్ డాగ్' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు
అయితే నాగార్జున 100వ సినిమాలో టబు నటించడం, ఆమె విలన్ పాత్ర, అలాగే 'లాటరీ కింగ్' టైటిల్‌కు సంబంధించి ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ వార్తల్లో ఎంత నిజం ఉందన్నది అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే స్పష్టత రానుంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)