పవన్ కళ్యాణ్ సినిమాకు నో.. అసలు కారణం చెప్పిన నాగదుర్గ
తెలంగాణ ఫోక్ సింగర్, డ్యాన్సర్ నాగదుర్గ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న 'ఇడుపు కాయితం' సినిమాతో హీరోయిన్‌గా ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ద్వారా నాగదుర్గ వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
అయితే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందే నాగదుర్గకు పలు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయని తాజాగా వెల్లడించింది. నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్', విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం', అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' సినిమాలో కీలక పాత్ర కోసం తనను సంప్రదించారని తెలిపింది.అయినా ఒక్క ఆఫర్‌ను కూడా అంగీకరించలేదని నాగదుర్గ చెప్పింది. అందుకు కారణం సినిమా కాదు.. తనకు నాట్యంపై ఉన్న అంకితభావమేనని వెల్లడించింది.ముఖ్యంగా కూచిపూడి నృత్యంలో డాక్టరేట్ చేయాలన్నది తన చిరకాల లక్ష్యమని, ఆ కలను నెరవేర్చుకోవడానికే అప్పట్లో వచ్చిన సినిమా అవకాశాలన్నింటినీ వదులుకున్నానని తెలిపింది.ఇప్పుడు మాత్రం మంచి కథ, తనకు నచ్చిన పాత్ర దొరకడంతో సినిమాల్లోకి అడుగుపెడుతున్నానని నాగదుర్గ చెప్పింది. ఇక 'ఇడుపు కాయితం' సినిమాతో ఈ తెలంగాణ ఫోక్ బ్యూటీ హీరోయిన్‌గా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)