బిగ్‌బాస్ కొత్త సీజన్‌కు కౌంట్‌డౌన్.. గంగూలీ ఎంట్రీతో మరింత క్రేజ్!
ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్ మరోసారి గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి జియోస్టార్ సంస్థ బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారిగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో షోను ఒకేసారి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
సెప్టెంబర్ నుంచి అన్ని భాషల బిగ్‌బాస్ ఎడిషన్లు జియోస్టార్ టెలివిజన్ నెట్‌వర్క్‌తో పాటు జియోహాట్‌స్టార్ ఓటీటీ వేదికపై ఏకకాలంలో ప్రసారం కానున్నాయి. దీంతో భాషలవారీగా నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా ప్రేక్షకులు తమకు నచ్చిన వెర్షన్‌ను ఒకేసారి వీక్షించవచ్చు.
తెలుగు బిగ్‌బాస్ ఇప్పటికే విజయవంతంగా 9 సీజన్లు పూర్తి చేసుకుంది. పదో సీజన్‌ను మరింత అట్టహాసంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా కొనసాగనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇక ఇతర భాషల హోస్ట్‌ల విషయానికి వస్తే.. హిందీలో సల్మాన్ ఖాన్, తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడలో కిచ్చా సుదీప్, మలయాళంలో మోహన్‌లాల్ హోస్ట్‌లుగా కొనసాగనున్నారు.
ఈ సీజన్‌లో ప్రత్యేక ఆకర్షణగా భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ బెంగాలీ బిగ్‌బాస్‌కు తొలిసారిగా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. గంగూలీ ఎంట్రీతో బెంగాలీ వెర్షన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)