సమంతకు సారె పెట్టిన చిరంజీవి.. ‘మా ఇంటి బంగారం’టీమ్‌కు మెగా అభినందనలు

Jun 23, 2026 - 13:18
0 2
సమంతకు సారె పెట్టిన చిరంజీవి.. ‘మా ఇంటి బంగారం’టీమ్‌కు మెగా అభినందనలు

సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందానికి మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రత్యేక అభినందనలు అందాయి. దర్శకురాలు నందిని రెడ్డి, క్రియేటర్ రాజ్ నిడిమోరుతో కలిసి సమంత సోమవారం సాయంత్రం చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు.

‘మా ఇంటి బంగారం’చిత్రం విడుదలైన తొలి వారాంతంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సినిమా విజయంతో ఆనందంలో ఉన్న టీమ్‌ను చిరంజీవి అభినందిస్తూ వారి కృషిని ప్రశంసించారు.

అయితే ఈ భేటీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చిరంజీవి - సురేఖ దంపతులు సమంత, రాజ్ నిడిమోరు జంటకు సారె పెట్టడం. సంప్రదాయబద్ధంగా చీరతో పాటు శంఖాన్ని బహుకరించి ఆశీర్వదించారు. అనంతరం వారితో కాసేపు ముచ్చటించిన చిరంజీవి, సినిమా విజయంపై ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా తీసిన ఫొటోలను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకోగా.. అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. అభిమానులు ‘మెగా బ్లెస్సింగ్స్’,‘గోల్డెన్ మూమెంట్’, ‘బంగారం టీమ్‌కు మెగా అభినందనలు’అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ విజయంతో పాటు.. సమంత, రాజ్ నిడిమోరు జంటకు చిరంజీవి - సురేఖ దంపతులు సారె పెట్టిన ఈ ప్రత్యేక సందర్భం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User