178 అంగన్‌వాడీ పోస్టుల భర్తీ.. ఇంటర్ పాస్ అయితే దరఖాస్తు చేసుకోవచ్చు

Jul 08, 2026 - 16:59
0 2
178 అంగన్‌వాడీ పోస్టుల భర్తీ.. ఇంటర్ పాస్ అయితే దరఖాస్తు చేసుకోవచ్చు

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 178 అంగన్‌వాడీ టీచర్, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన స్థానిక మహిళా అభ్యర్థులు జూలై 18, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం 178 పోస్టులు

ఈ నోటిఫికేషన్ కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో నియామకాలు చేపట్టనున్నారు.

ప్రాజెక్టుల వారీగా ఖాళీలు:

అశ్వారావుపేట – 11
బూర్గంపాడు – 10
చంద్రుగొండ – 8
చర్ల – 12
దమ్మపేట – 16
దుమ్ముగూడెం – 12
కొత్తగూడెం – 16
మణుగూరు – 24
పాల్వంచ – 29
టేకులపల్లి – 19
ఇల్లెందు – 21

అర్హతలు

అభ్యర్థులు తప్పనిసరిగా:

*ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
*ఇంటర్ అర్హత కలిగిన వారు అందుబాటులో లేని పరిస్థితిలో పదో తరగతి ఉత్తీర్ణులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
*వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

పట్టణ ప్రాంతాల్లో సంబంధిత వార్డులో, గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తూ ఉండాలి. గిరిజన తండాలు, గూడేలు, ఆవాసాల్లోని పోస్టులకు సంబంధిత ఎస్టీ మహిళలు మాత్రమే అర్హులు. ఎస్సీ వాడల్లోని పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది.

ఎంపిక విధానం

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తుంది.

మార్కులకు వెయిటేజీ ఇలా ఉంటుంది:

*ఇంటర్మీడియట్ మార్కులు – 70%
*వితంతువులకు – 5%
*అనాథలకు – 10%
*దివ్యాంగులకు – 5%
*ఇంటర్వ్యూ – 10 మార్కులు

ముఖ్యమైన తేదీలు

*దరఖాస్తుల చివరి తేదీ: జూలై 18, 2026
*ధ్రువపత్రాల పరిశీలన: జూలై 20 నుంచి ఆగస్టు 7, 2026 వరకు

అప్లోడ్ చేయాల్సిన పత్రాలు

ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో ఈ పత్రాలను అప్లోడ్ చేయాలి.

*పుట్టిన తేదీ/వయస్సు ధ్రువీకరణ పత్రం
*కుల ధ్రువీకరణ పత్రం
*ఇంటర్మీడియట్ మార్కుల మెమో
*నివాస ధ్రువీకరణ పత్రం
*దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్
*వితంతువులైతే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
*అనాథ అభ్యర్థులైతే అనాథ ధ్రువీకరణ పత్రం

రాష్ట్రవ్యాప్తంగా భారీ నియామకాలు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15,982 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియను దశలవారీగా కొనసాగిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదల కాగా, తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన మహిళలు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User