ఏపీ గురుకుల విద్యార్థులకు శుభవార్త.. ఇక ప్రతిరోజూ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడే అవకాశం

Jul 19, 2026 - 12:12
0 2
ఏపీ గురుకుల విద్యార్థులకు శుభవార్త.. ఇక ప్రతిరోజూ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడే అవకాశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురుకుల హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో విద్యార్థులు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ప్రతిరోజూ ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రత్యేక టెలిఫోన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రతి విద్యార్థికి స్మార్ట్ కార్డు జారీ చేసి, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన గరిష్ఠంగా ఐదు ఫోన్ నంబర్లను మాత్రమే మ్యాపింగ్ చేస్తారు. ఆ నంబర్లకే కాల్ చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థుల చదువుకు అంతరాయం కలగకుండా ఉదయం తరగతులు ప్రారంభానికి ముందు గంటపాటు, సాయంత్రం తరగతులు ముగిసిన తర్వాత మరో గంటపాటు ఫోన్ మాట్లాడేందుకు సమయం కేటాయించారు.

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో గురుకులంలో ఐదు నుంచి ఆరు ఫోన్ బాక్సులను ఏర్పాటు చేశారు. ప్రతి స్మార్ట్ కార్డుకు రూ.150 రీచార్జ్‌తో వెయ్యి నిమిషాల వరకు మాట్లాడే అవకాశం ఉంటుంది. అనంతరం అవసరాన్ని బట్టి మళ్లీ రీచార్జ్ చేసుకోవచ్చు.

విద్యార్థుల్లో హోమ్‌సిక్ సమస్యను తగ్గించడం, తల్లిదండ్రులతో నిరంతర సంబంధాన్ని కొనసాగించడం, చదువుపై మరింత దృష్టి పెట్టేలా చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ కొత్త విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User