హైదరాబాద్‌లో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఐటీ కారిడార్‌లో సిగ్నల్ ఫ్రీ జర్నీకి శ్రీకారం

Jul 19, 2026 - 12:16
0 3
హైదరాబాద్‌లో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఐటీ కారిడార్‌లో సిగ్నల్ ఫ్రీ జర్నీకి శ్రీకారం

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా నగరంలోనే తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్‌లో చేపట్టిన ఈ మెగా ప్రాజెక్టు ద్వారా గచ్చిబౌలి, విప్రో సర్కిల్, కొండాపూర్, లింగంపల్లి మార్గాల్లో ప్రయాణం మరింత వేగవంతం కానుంది.

హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద రూ.459 కోట్లతో మూడు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్ నిర్మిస్తున్నారు. అలాగే ఖాజాగూడ జంక్షన్ అభివృద్ధి కోసం రూ.220 కోట్లతో మరో ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టులను 2027 ఏప్రిల్–మే నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రాజెక్టులో భాగంగా ఐఎస్‌బీ రోడ్–డీఎల్‌ఎఫ్ మార్గంలో 720 మీటర్ల నాలుగు లైన్ల ఫ్లైఓవర్, దాని పైన 948 మీటర్ల మూడు లైన్ల రెండో స్థాయి ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. అలాగే ఐఎస్‌బీ రోడ్ నుంచి గచ్చిబౌలి వైపు 1.2 కిలోమీటర్ల పొడవుతో మరో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తున్నారు. అదనంగా గచ్చిబౌలి–లింగంపల్లి మధ్య 520 మీటర్ల ఆరు లైన్ల అండర్‌పాస్ నిర్మాణం కొనసాగుతోంది.

ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఐటీ ఉద్యోగులు, నగర ప్రజలకు 10 నుంచి 15 నిమిషాల వరకు ప్రయాణ సమయం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ వ్యవస్థను విస్తరించేందుకు ప్రభుత్వం మరిన్ని ఫ్లైఓవర్లు, అండర్‌పాసులను నిర్మిస్తోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User