పుష్ప పల్లకీపై శ్రీ భూదేవి సమేత మలయప్పస్వామివారి వైభవం..

Jul 18, 2026 - 15:36
0 2
పుష్ప పల్లకీపై శ్రీ భూదేవి సమేత మలయప్పస్వామివారి వైభవం..

ఆణివార ఆస్థానం సందర్భంగా తిరుమలలో శుక్రవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్ప పల్లకీపై పురవీధుల గుండా విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ఈ పల్లకీ ఉత్సవం తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది.

టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పుష్ప పల్లకీకి అద్భుతమైన అలంకరణలు చేశారు. పల్లకీ ముందుభాగంలో శ్రీ మహావిష్ణువు, ఇరువైపులా జయ-విజయులు, మధ్యలో ద్వారక కృష్ణుడు, వెనుక భాగంలో శ్రీ ఆంజనేయస్వామివారి రూపాలను పుష్పాలతో అందంగా తీర్చిదిద్దారు.

అలంకరణలో రోజాలు, చామంతులు, లిల్లీలు, మొల్లలు, మల్లెపూలు, కనకాంబరాలు, తామరపూలు, వృక్షి పుష్పాలు సహా మొత్తం తొమ్మిది రకాల సాంప్రదాయ పుష్పాలతో పాటు ఐదు రకాల కట్ ఫ్లవర్స్‌ను వినియోగించారు. వివిధ రంగుల పుష్పాలతో రూపొందించిన ప్రత్యేక అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈఓ సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User