విజయ్ కోసం కొడుకు త్యాగం..? ‘సిగ్మా’సినిమా వాయిదా పడనున్నదా?

Jul 14, 2026 - 17:25
0 6
విజయ్ కోసం కొడుకు త్యాగం..? ‘సిగ్మా’సినిమా వాయిదా పడనున్నదా?

తమిళ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న తొలి చిత్రం ‘సిగ్మా’విడుదల వాయిదా పడనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ‘సిగ్మా’సినిమాను మొదట జులై 31న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. అయితే ‘జన నాయగన్’విడుదలైన వారం రోజుల్లోనే ఈ సినిమా రావడం బాక్సాఫీస్‌పై ప్రభావం చూపే అవకాశముండటంతో, విడుదలను ఆగస్టుకు మార్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

విజయ్ కెరీర్‌లో చివరి సినిమాగా వస్తున్న ‘జన నాయగన్’పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మరో సినిమా విడుదల చేయడం రిస్క్‌గా భావించి, ‘సిగ్మా’రిలీజ్‌ను వాయిదా వేయాలని చిత్రబృందం నిర్ణయించి ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది.

‘సిగ్మా’చిత్రానికి జేసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తుండగా, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే ‘సిగ్మా’వాయిదాపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User