అమరావతిలో స్టీల్ బ్రిడ్జి రెడీ.. వైరల్ అవుతున్న అద్భుత దృశ్యాలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఎప్పటికప్పుడు పనులను సమీక్షిస్తూ వేగవంతం చేస్తున్నారు.
సీడ్ యాక్సిస్ రోడ్డులో భాగంగా కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై నిర్మిస్తున్న 128 మీటర్ల నాలుగు లేన్ల స్టీల్ బ్రిడ్జి పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం తారు పనులు కొనసాగుతుండగా, ఆగస్టు 15లోపు బ్రిడ్జిని పూర్తిచేయాలని లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు.
రూ.70 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెన విజయవాడ, మంగళగిరి ప్రాంతాలను అమరావతితో మరింత వేగంగా అనుసంధానించనుంది. ఇదే ప్రాజెక్టులో కొండవీటి వాగుపై మరో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం కూడా చివరి దశలో ఉంది.
ఇటీవల స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆధునిక నిర్మాణ శైలితో రూపొందుతున్న ఈ వంతెన రాజధాని అభివృద్ధికి మరో ప్రతీకగా నిలవనుంది.
అమరావతి రాజధానిలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. దేశంలో తొలిసారిగా డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)