ఒకే టికెట్‌తో బస్సు + ఆటో.. TGSRTC కొత్త సేవ

Jul 30, 2026 - 14:22
0 3
ఒకే టికెట్‌తో బస్సు + ఆటో.. TGSRTC కొత్త సేవ

ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. 'ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ' లక్ష్యంతో బస్సు ప్రయాణానికి అనుసంధానంగా ఎలక్ట్రిక్ ఆటో సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతుండగా, ఎలక్ట్రిక్ ఆటో తయారీ సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయి.

ఈ సేవలో భాగంగా ప్రయాణికులు ఒకే బుకింగ్‌లో బస్సు టికెట్‌తో పాటు ఎలక్ట్రిక్ ఆటో టికెట్‌ను కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇంటి నుంచి బస్ స్టాప్‌కు, అలాగే గమ్యస్థానంలోని బస్ స్టాప్ నుంచి చివరి గమ్యానికి చేరుకునే ప్రయాణం మరింత సులభంగా మారనుంది. దీంతో సమయం, శ్రమ ఆదా కావడంతో పాటు ప్రజా రవాణా వినియోగం కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మొదటి దశలో ఈ సేవలను హైదరాబాద్‌లో ప్రారంభించి, స్పందన ఆధారంగా రాష్ట్రంలోని ఇతర నగరాలకు విస్తరించే ప్రణాళిక ఉంది. పర్యావరణహిత రవాణాను ప్రోత్సహిస్తూ ప్రజలకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని టీజీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User