కొడుకుతో ప్రభుదేవా మాస్ డ్యాన్స్.. వైరల్ వీడియో!

Jul 30, 2026 - 14:35
0 4
కొడుకుతో ప్రభుదేవా మాస్ డ్యాన్స్.. వైరల్ వీడియో!

ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరొందిన ప్రభుదేవా మరోసారి తన డ్యాన్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఈసారి ఆయన ఒక్కడే కాదు.. తన కుమారుడు రిషి రాఘవేందర్ దేవాతో కలిసి చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

అమెరికాలో జరగనున్న తన డ్యాన్స్ షో రిహార్సల్స్‌లో భాగంగా బీచ్‌లో సూపర్ హిట్ సాంగ్ 'పేట్టా రాప్'కు ప్రభుదేవా స్టెప్పులు వేశారు. ఆయనతో పాటు రిషి కూడా అదే గ్రేస్, అదే టైమింగ్‌తో డ్యాన్స్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తండ్రీకొడుకుల సమన్వయం చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

"తండ్రికి తగ్గ తనయుడు", "డ్యాన్స్ రక్తంలోనే ఉంది", "ప్రభుదేవా వారసుడు వచ్చేశాడు" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా ఈ వీడియోపై స్పందిస్తూ తండ్రీకొడుకుల పెర్ఫార్మెన్స్‌ను అభినందిస్తున్నారు.

కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన ప్రభుదేవా.. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇప్పుడు ఆయన డ్యాన్స్ వారసత్వాన్ని కుమారుడు రిషి కూడా కొనసాగిస్తాడనే చర్చ అభిమానుల్లో మొదలైంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User