జూలైలో తిరుచానూరు శ్రీపద్మావతి ఆలయంలో విశేష ఉత్సవాలు.. పూర్తి షెడ్యూల్ ఇదే
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, అనుబంధ దేవాలయాల్లో జూలై నెల పొడవునా పలు విశేష ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. శుక్రవారం ప్రత్యేక ఉత్సవాలు, అవతారోత్సవాలు, నక్షత్రోత్సవాలు, దక్షిణాయన పుణ్యకాల వేడుకలు భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి.
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం
జూలై 3, 10, 17, 24, 31 తేదీల్లో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
శ్రీ బలరామ కృష్ణస్వామి ఆలయం
జూలై 12 రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీకృష్ణస్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
శ్రీ సుందరరాజ స్వామి ఆలయం
జూలై 5 నుంచి 7 వరకు శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాలు.
జూలై 29 ఉత్తర భాద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు స్వామివారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించనున్నారు.
శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం
జూలై 17 దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం.
జూలై 20 హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు స్వామివారి తిరుచ్చి సేవ.
తిరుచానూరు శ్రీనివాస ఆలయం
ఆగస్టు 4, 11, 18, 25 తేదీల్లో శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్టుకు అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
భక్తులు ఈ విశేష ఉత్సవాల్లో పాల్గొని స్వామి, అమ్మవార్ల అనుగ్రహం పొందాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)