టీమిండియాను ఐర్లాండ్ ఎలా మట్టికరిపించింది? అసలు కారణాలివే..

Jun 29, 2026 - 12:16
0 2
టీమిండియాను ఐర్లాండ్ ఎలా మట్టికరిపించింది? అసలు కారణాలివే..

టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐర్లాండ్ వరుస విజయాలు సాధించి 2-0తో టీమిండియాను క్లీన్‌స్వీప్ చేసింది. ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచిన ఈ విజయంతో ఐర్లాండ్ తన సత్తాను మరోసారి నిరూపించింది.

భారత్‌లాంటి బలమైన జట్టును ఓడించడంలో ఐర్లాండ్ విజయం వెనుక కేవలం అదృష్టం మాత్రమే కాదు.. పక్కా ప్రణాళిక, ఆత్మవిశ్వాసం, యువ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన ప్రధాన కారణాలుగా నిలిచాయి.

టీమిండియాకు హెడ్ కోచ్‌తో పాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, స్పిన్, అసిస్టెంట్ కోచ్‌లు కలిపి మొత్తం ఆరుగురు కోచింగ్ సిబ్బంది ఉన్నారు. మరోవైపు ఐర్లాండ్‌కు మాత్రం కేవలం ఇద్దరు కోచ్‌లే ఉన్నారు. బ్యాటింగ్ కోచ్ హెన్రిచ్ మలాన్, బౌలింగ్ కోచ్ రయాన్ ఈగల్సన్ మార్గదర్శకత్వంలోనే జట్టు ఈ చారిత్రక విజయాన్ని అందుకుంది.

అయితే ఈ విజయానికి అసలు హీరోలు యువ బౌలర్లు జై మూంద్రా, మాథ్యూ హోలార్డ్. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే తొలి సిరీస్ అయినప్పటికీ వీరిద్దరూ కలిసి రెండు మ్యాచ్‌ల్లో మొత్తం 11 వికెట్లు పడగొట్టారు. జై మూంద్రా ఐదు వికెట్లు, మాథ్యూ హోలార్డ్ ఆరు వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను పూర్తిగా కట్టడి చేశారు.

రెండో టీ20లోనూ ఇద్దరూ చెరో మూడు వికెట్లు తీసి భారత జట్టు ఓటమిలో కీలక పాత్ర పోషించారు. విశేషం ఏమిటంటే జై మూంద్రా భారతదేశంలోని రాజస్థాన్‌కు చెందిన ఆటగాడు. తర్వాత ఐర్లాండ్‌లో స్థిరపడి అక్కడి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

తక్కువ కోచింగ్ సిబ్బంది ఉన్నప్పటికీ, యువ ఆటగాళ్లపై నమ్మకం, కచ్చితమైన ప్రణాళిక, ఏ ప్రత్యర్థినైనా ఓడించగలమనే ఆత్మవిశ్వాసంతో ఐర్లాండ్ ఈ అరుదైన ఘనతను సాధించింది. ఈ సిరీస్ విజయంతో ప్రపంచ క్రికెట్‌లో ఐర్లాండ్ భవిష్యత్‌పై అంచనాలు మరింత పెరిగాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User