ఫిల్మ్‌నగర్‌లో కలకలం.. నటుడు ధర్మ మహేశ్ ఇంట్లోకి దూసుకెళ్లిన లగ్జరీ కారు
హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో గురువారం అర్ధరాత్రి జరిగిన కారు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. అతివేగంగా వెళ్తున్న ఓ లగ్జరీ కారు అదుపుతప్పి టాలీవుడ్ నటుడు ధర్మ మహేశ్ ఇంటి ప్రహారీ గోడను, ప్రధాన గేటును ఢీకొట్టి ఇంటి ప్రాంగణంలోకి దూసుకెళ్లింది.
సమాచారం మేరకు, కారులో ప్రయాణిస్తున్న కొందరు యువకులు అతివేగంగా వెళ్తుండగా రహదారిపై నియంత్రణ కోల్పోయారు. దీంతో కారు నేరుగా ధర్మ మహేశ్ నివాసం గేటును ఢీకొంటూ లోపలికి వెళ్లింది. ఈ ఘటనలో ఇంటి ప్రహారీ గోడ, గేటు కొంతమేర దెబ్బతిన్నాయి.
ప్రమాదం జరిగిన సమయంలో భారీ శబ్దం రావడంతో ధర్మ మహేశ్ కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల నివాసితులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఇంట్లో ఉన్న ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఘటనపై నటుడు ధర్మ మహేశ్ వెంటనే ఫిల్మ్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారులో ఉన్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక దర్యాప్తు కొనసాగుతోంది.
'డ్రింకర్ సాయి', 'సింధూరం' తదితర చిత్రాల ద్వారా గుర్తింపు పొందిన నటుడు ధర్మ మహేశ్ నివాసంలో ఈ ఘటన చోటుచేసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)