తెలంగాణలో తొలిసారి.. ఒకటో తేదీకే కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు

Jul 02, 2026 - 14:59
0 2
తెలంగాణలో తొలిసారి.. ఒకటో తేదీకే కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు

తెలంగాణలో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని అమలు చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దాదాపు 5 లక్షల మంది కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, గౌరవ వేతనం పొందుతున్న ఉద్యోగుల ఖాతాల్లో జూలై 1వ తేదీనే వేతనాలు జమయ్యాయి.దశాబ్దాలుగా జీతాల కోసం వారాల తరబడి, కొన్ని సందర్భాల్లో నెలల తరబడి ఎదురుచూసే పరిస్థితికి ఈ నిర్ణయంతో ముగింపు పలికినట్లు ప్రభుత్వం తెలిపింది.

జూన్ 15న ఉత్తర్వులు.. జూలై 1 నుంచే అమలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం జూన్ 15న ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, గౌరవ వేతనం పొందుతున్న ఉద్యోగులందరికీ ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించింది.ఉత్తర్వులు జారీ చేసిన కేవలం 15 రోజుల్లోనే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చి, జూలై 1న మెజారిటీ శాఖల్లో ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమ చేశారు.

దాదాపు 5 లక్షల మందికి ప్రయోజనం

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు 4.98 లక్షల మంది కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో కొందరికి ప్రభుత్వం నేరుగా, మరికొందరికి అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా వేతనాలు చెల్లించబడుతున్నాయి.గతంలో నిధుల విడుదలలో జాప్యం, ఏజెన్సీల ఆలస్యం కారణంగా ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. తాజా నిర్ణయంతో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు.

ఆలస్యంపై సీఎంవో సీరియస్

జీతాల చెల్లింపు ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బిల్లులు సమర్పించిన అన్ని శాఖలకు నిధులు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వివరించింది.అయితే మున్సిపల్, అటవీ, మహిళా శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖల్లో కొంత ఆలస్యం జరిగినట్లు గుర్తించిన సీఎంవో సంబంధిత అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. భవిష్యత్తులో జీతాల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.

ఉద్యోగుల్లో హర్షం

ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇంత త్వరగా అమల్లోకి వస్తుందని ఊహించలేదని కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా సకాలంలో జీతాలు రావడం వల్ల కుటుంబాల ఆర్థిక ప్రణాళికలు మెరుగుపడటంతో పాటు అప్పుల భారాన్ని తగ్గించుకోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User