వేములవాడ భీమేశ్వరస్వామి ఆలయానికి భక్తుల రద్దీ.. 3 నెలల్లో రూ.46 లక్షల ఆదాయం

Jul 16, 2026 - 14:44
0 5
వేములవాడ భీమేశ్వరస్వామి ఆలయానికి భక్తుల రద్దీ.. 3 నెలల్లో రూ.46 లక్షల ఆదాయం

తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి అనుబంధ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయానికి భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా స్వామివారికి నిర్వహించే ప్రత్యేక అభిషేక పూజలకు విశేష స్పందన లభిస్తుండటంతో ఆలయ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.

రాజన్న ప్రధాన ఆలయంలో పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అభిషేక పూజలను భీమేశ్వరస్వామి ఆలయానికి మార్చారు. అప్పటి నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో భీమేశ్వరస్వామిని దర్శించుకుని అభిషేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా శివభక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.

ప్రత్యేకంగా ప్రతి సోమవారం జరిగే అభిషేక పూజలకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుతం రూ.1,000 ప్రత్యేక టికెట్ ద్వారా ఒక జంటకు అభిషేకం నిర్వహించే అవకాశం కల్పిస్తున్నారు. రద్దీ రోజుల్లో భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోతోంది.

ఆలయ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల్లో మొత్తం 4,600 అభిషేకం టికెట్లు విక్రయమయ్యాయి.దీని ద్వారా ఆలయానికి రూ.46 లక్షల ఆదాయం సమకూరింది.

ఇక ఇటీవల ఆరుద్ర నక్షత్రం, సోమవారం ఒకే రోజు రావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఆ రోజే రికార్డు స్థాయిలో 266 అభిషేకం టికెట్లు విక్రయమయ్యాయి. భీమేశ్వరస్వామి ఆలయ చరిత్రలో ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో అభిషేకాలు జరగడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.

రానున్న శ్రావణం, కార్తీక మాసాల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని, ఆలయ ఆదాయం కూడా కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User