హైదరాబాద్ లూలూ మాల్‌లో గన్ కలకలం.. తుపాకీతో వచ్చిన వ్యక్తిపై విచారణ
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు సమీపంలోని లూలూ మాల్‌లో గన్ కలకలం చోటుచేసుకుంది. మాల్‌లోని B2 పార్కింగ్ ప్రాంతంలో రెండు కుటుంబాల మధ్య క్యూలో నిలబడే విషయంలో జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి జేబులో తుపాకీ ఉన్నట్లు గుర్తించిన పలువురు మాల్ యాజమాన్యానికి, KPHB పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మహ్మద్ సిద్ధిఖీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 2029 వరకు చెల్లుబాటులో ఉన్న లైసెన్స్ కలిగిన తుపాకీతో పాటు 12 రౌండ్ల తూటాలు ఉన్నట్లు గుర్తించారు. విచారణ అనంతరం లైసెన్స్ చెల్లుబాటులో ఉండటంతో, బహిరంగ ప్రదేశంలో ఇబ్బంది కలిగించినందుకు నోటీసులు జారీ చేసి ఆయుధాన్ని తిరిగి అప్పగించారు.
అయితే, లైసెన్స్ ఉన్న తుపాకీతో ఒక వ్యక్తి మాల్‌లోకి ఎలా ప్రవేశించాడన్న అంశంపై పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. భద్రతా సిబ్బంది తనిఖీల్లో నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందనే అనుమానంతో లూలూ మాల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు సూచించారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)