ఆకాశంలో అమరావతి.. రోప్‌వే, లండన్ ఐతో టూరిజం హబ్‌గా ఏపీ రాజధాని!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా పర్యాటకం, వినోదం, ఆర్థిక కార్యకలాపాలకు హబ్‌గా మార్చే లక్ష్యంతో ఐకానిక్ ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. 64వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పీపీపీ (PPP) విధానంలో రోప్‌వే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.
ప్రతిపాదిత రోప్‌వే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్, ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయం, పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ మీదుగా వెంకటపాలెంలోని టీటీడీ ఆలయం వరకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా నది అందాలను ఆకాశ మార్గంలో వీక్షించే అవకాశం కలగనుంది.
రోప్‌వేతో పాటు లండన్ ఐ తరహా భారీ అబ్జర్వేషన్ వీల్, మినీ అమెజాన్ థీమ్ పార్క్ వంటి పర్యాటక ఆకర్షణలను కూడా అమరావతిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు టెండర్ల దశకు చేరుకోగా, మరికొన్ని ప్రణాళికల దశలో ఉన్నాయి.
ఈ రోప్‌వే కేవలం టూరిస్టు ఆకర్షణ మాత్రమే కాకుండా నగరంలోని కీలక ప్రాంతాలను అనుసంధానించే ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థగా కూడా ఉపయోగపడేలా రూపొందించనున్నారు. దీంతో ట్రాఫిక్ భారం తగ్గడంతో పాటు నగర రవాణాలో కొత్త అనుభూతి కలగనుంది.
ఒక కోటి జనాభాకు అవసరమైన మౌలిక వసతులతో మెగా సిటీగా అమరావతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. డేటా సెంటర్లు, 5జీ నెట్‌వర్క్, క్వాంటమ్ వ్యాలీ, కొత్త వంతెనలు, ఐకానిక్ టూరిజం ప్రాజెక్టులతో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు చర్యలు వేగవంతమయ్యాయి

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)