ఆగస్టు 7 నుంచి శ్రీ కోదండరామస్వామి పవిత్రోత్సవాలు

Jul 30, 2026 - 14:24
0 3
ఆగస్టు 7 నుంచి శ్రీ కోదండరామస్వామి పవిత్రోత్సవాలు

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 7 నుంచి 10 వరకు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికలు, బుక్‌లెట్లను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ఆవిష్కరించారు. ఆగస్టు 7న అంకురార్పణతో ప్రారంభమయ్యే ఉత్సవాల్లో మేదినీ పూజ, మృత్సంగ్రహణం, పవిత్ర సమర్పణ, పూర్ణాహుతి వంటి వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగనున్నాయి.

ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. రూ.500 చెల్లించి గృహస్తులు ప్రత్యేకంగా పాల్గొనే అవకాశం కల్పించారు. హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User