హీరోలు మాత్రమే కాదు.. నిర్మాతలుగానూ టాలీవుడ్ స్టార్స్ హవా! కొత్త ట్రెండ్‌కు శ్రీకారం

Aug 05, 2026 - 12:54
Updated: 2 months ago
0 3
హీరోలు మాత్రమే కాదు.. నిర్మాతలుగానూ టాలీవుడ్ స్టార్స్ హవా! కొత్త ట్రెండ్‌కు శ్రీకారం

టాలీవుడ్‌లో హీరోలు కేవలం వెండితెరపైనే కాదు... ఇప్పుడు కెమెరా వెనుక కూడా తమ సత్తా చాటుతున్నారు. సొంత నిర్మాణ సంస్థలను ప్రారంభించి కొత్త దర్శకులు, కొత్త హీరోలకు అవకాశాలు ఇస్తూ నిర్మాతలుగా కూడా విజయవంతమైన ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు అరుదుగా కనిపించిన ఈ ధోరణి ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌గా మారింది.

ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు నేచురల్ స్టార్ నాని. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై 'హిట్' ఫ్రాంచైజీ, 'కోర్ట్' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆయన... ఇప్పుడు నితిన్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రంతో పాటు, చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందనున్న భారీ ప్రాజెక్ట్‌ను కూడా నిర్మిస్తున్నారు. మంచి కథలను ఎంపిక చేయడంలో నిర్మాతగానూ నాని ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

కింగ్ నాగార్జున కూడా అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా నిర్మాతగా బిజీగా కొనసాగుతున్నారు. అఖిల్ నటించిన 'లెనిన్' చిత్రాన్ని నిర్మించిన ఆయన, ప్రస్తుతం అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'రంభ ఊర్వశి మేనక' సినిమాను నిర్మిస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో పాటు వి మెగా పిక్చర్స్ ద్వారా నిర్మాతగా అడుగులు వేస్తున్నారు. నిఖిల్ హీరోగా రూపొందుతున్న 'ది ఇండియా హౌస్' చిత్రాన్ని నిర్మిస్తూ భారీ ప్రాజెక్టులకు అండగా నిలుస్తున్నారు.

నందమూరి కళ్యాణ్ రామ్ కూడా నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్‌తో 'జై లవకుశ', రవితేజతో 'కిక్ 2' వంటి చిత్రాలను నిర్మించిన ఆయన, ప్రస్తుతం పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో నిర్మాతగా, సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. తనతో పనిచేసిన సాయి తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'తిమ్మరాజుపల్లి' చిత్రాన్ని నిర్మించారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ఒకప్పుడు హీరోలు నటనకే పరిమితమైతే... ఇప్పుడు మంచి కథలకు పెట్టుబడి పెట్టడం, కొత్త దర్శకులను ప్రోత్సహించడం, కొత్త హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేయడం ద్వారా నిర్మాతలుగానూ టాలీవుడ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్ భవిష్యత్తులో తెలుగు సినీ పరిశ్రమకు మరింత బలాన్ని తీసుకురానుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User