తెలంగాణలో అమెజాన్ మెగా డేటా సెంటర్.. ఫ్యూచర్ సిటీలో రూ.60 వేల కోట్ల పెట్టుబడి

Jul 15, 2026 - 16:10
0 3
తెలంగాణలో అమెజాన్ మెగా డేటా సెంటర్.. ఫ్యూచర్ సిటీలో రూ.60 వేల కోట్ల పెట్టుబడి

తెలంగాణలో డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ దిగ్గజ సంస్థ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)రూ.60 వేల కోట్ల భారీ పెట్టుబడితో మెగా డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

ఈ డేటా సెంటర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 300 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాలు, చందన్‌వెల్లిలో 98 ఎకరాలు ఉన్నాయి. అదనంగా సంస్థకు రూ.125 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు, రాయితీలు కూడా ప్రకటించింది.

ఈ భారీ పెట్టుబడికి 2025లో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అమెజాన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు పునాది వేశాయి. అనంతరం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం, అమెజాన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.

ప్రాజెక్టు తొలి దశ నిర్మాణాన్ని 24 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, పూర్తి విస్తరణను 10 సంవత్సరాల్లో దశలవారీగా పూర్తి చేయనున్నారు. ముంబై తర్వాత దేశంలో అమెజాన్ రెండో క్లౌడ్ రీజియన్ హైదరాబాద్‌లో ఏర్పడనుండటం విశేషంగా మారింది.

ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ బ్యాంకింగ్, ఈ-కామర్స్, హెల్త్‌టెక్, ప్రభుత్వ డిజిటల్ సేవలు, స్టార్టప్ ఎకోసిస్టమ్ మరింత బలోపేతం కానున్నాయి. అలాగే వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, ఫ్యూచర్ సిటీ మరియు పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE) అభివృద్ధికి ఈ పెట్టుబడి కీలకంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది.

హైదరాబాద్‌ను దేశంలోనే ప్రముఖ హైపర్ స్కేల్ డేటా సెంటర్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా ఈ అమెజాన్ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలవనుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User