‘కుంకుమ భాగ్యం’నటి ఆత్మహత్య
ముంబై: ప్రముఖ టెలివిజన్ నటి సంచిత ఉగాలే మృతి టీవీ ఇండస్ట్రీని విషాదంలో ముంచేసింది. ‘కుంకుమ భాగ్య’ సీరియల్లో దియా టాండన్ పాత్రతో గుర్తింపు పొందిన సంచిత, ముంబై సమీపంలోని తన నివాసంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతదేహంగా కనిపించినట్లు సమాచారం. ప్రాథమిక నివేదికల ప్రకారం ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు సంచితను బెడ్రూమ్లో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతున్న స్థితిలో గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అచోలే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

‘కుంకుమ భాగ్య’తో పాటు ‘వాగ్లే కి దునియా’, ‘దిల్వాలీ దుల్హా లే జాయేగి’ వంటి పలు టీవీ షోలలో నటించిన సంచిత తన నటనతో ప్రేక్షకుల ఆదరణ పొందారు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు, మరణానికి కొన్ని గంటల ముందు సంచిత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేయడం అభిమానులను మరింత కలచివేస్తోంది. వీడియోలో ఆమె ఉత్సాహంగా కనిపించగా, కొద్దిసేపటికే ఈ విషాద వార్త వెలుగులోకి రావడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు.
సంచిత మృతిపై సోషల్ మీడియాలో అభిమానులు, సహనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)