అల్లు అర్జున్‌కు సమన్లు.. కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశం
CONTENT
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి విచారణ చేపట్టిన న్యాయస్థానం, అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
‘పుష్ప-2’బెనిఫిట్ షో సందర్భంగా థియేటర్ వద్ద భారీ సంఖ్యలో అభిమానులు గుమికూడటంతో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై నమోదైన కేసును పోలీసులు సుదీర్ఘంగా దర్యాప్తు చేసి నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.

ఈ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు, అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా పేర్కొన్నారు. థియేటర్ యాజమాన్యం, నిర్వాహకులు సహా పలువురిపై కేసులు నమోదు చేసినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, భారీ జనసందోహాన్ని నియంత్రించడంలో వైఫల్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
ఛార్జిషీట్‌ను పరిశీలించిన నాంపల్లి కోర్టు ఇప్పటికే 19 మంది నిందితులకు సమన్లు జారీ చేసింది. వారందరూ వచ్చే సోమవారం కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. నిందితుల హాజరు ప్రక్రియ పూర్తయిన అనంతరం కేసు ప్రధాన విచారణ ప్రారంభం కానుంది.
అల్లు అర్జున్‌కు సమన్లు జారీ కావడం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సోమవారం ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతారా లేదా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ కేసు విచారణలో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నదానిపై సినీ, రాజకీయ వర్గాలు దృష్టి సారించాయి.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)