గద్వాల్ విజయలక్ష్మి సోదరి అదృశ్యం.. ముగ్గురిపై అనుమానం
హైదరాబాద్‌లో తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కుటుంబంలో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఆమె సోదరి కె. నమ్రత (57) అదృశ్యమైనట్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, నమ్రత ఈ నెల 4వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం గద్వాల్ విజయలక్ష్మి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.తన సోదరి అదృశ్యం వెనుక సతీష్, సత్యనారాయణ, కుమారి అనే ముగ్గురు వ్యక్తుల ప్రమేయం ఉండవచ్చని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
ఫిర్యాదు స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నమ్రత ఫోన్ కాల్ డేటా, ఇటీవల ఆమె కలిసిన వ్యక్తులు, వెళ్లిన ప్రాంతాల వివరాలను సేకరిస్తున్నారు. అలాగే కుటుంబ సభ్యులు, సన్నిహితులను ప్రశ్నిస్తూ వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.నమ్రత ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)