శ్రీరాముడిపై ప్రకాశ్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు తిరుపతిలో క్రిమినల్ కేసు నమోదు..
తిరుపతి: సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పై తిరుపతిలో క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఈ కేసును తిరుపతి 4వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో దాఖలు చేశారు.ఈ సందర్భంగా భాను ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని దొంగతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు.ఇప్పటికే ప్రకాశ్ రాజ్‌కు నోటీసులు పంపినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని, అందుకే న్యాయపరమైన చర్యలకు దిగాల్సి వచ్చిందని భాను ప్రకాశ్ అన్నారు .ఈ కేసు ద్వారా ప్రకాశ్ రాజ్‌ను కోర్టు ముందుకు తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు.అలాగే హిందూ మనోభావాలతో చెలగాటం ఆడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే సినీ పరిశ్రమకు సంబంధించిన సంఘాలకు ఫిర్యాదు చేసి, ప్రకాశ్ రాజ్ నటించిన సినిమాలను బహిష్కరించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపారు.
ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసుపై ప్రకాశ్ రాజ్ స్పందన ఎలా ఉంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)